కరోనా విస్తరిస్తున్నందున లాక్‌డౌన్ ఒక్కటే సరైన మార్గమని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి మద్దతు లేకపోతే లాక్‌డౌన్ నిర్వహించలేమన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు. స్థానికుల నివాస ప్రాంతం నుంచి 3 కి.మీ వరకే అనుమతి ఉందని.. రాత్రి 7 దాటిన తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజా మద్దతుతోనే కరోనా కట్టడి సాధ్యం: డీజీపీ - state dgp mahendar reddy said about lock down in hyderabad
కొవిడ్-19ను అరికట్టాలంటే లాక్‌డౌన్ ఒక్కటే సరైన మార్గమని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల మద్దతు లేకపోతే నిర్వహించలేమని.. సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికుల నివాస ప్రాంత నుంచి 3 కి.మీ వరకే అనుమతి ఉందని స్పష్టం చేశారు.
ప్రజల మద్దతు లేకపోతే నిర్వహించలేం: డీజీపీ