హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ రెండు పట్టభద్రుల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు 54 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ మండలి స్థానానికి 29 మంది, నల్గొండ మండలి స్థానానికి 25మంది లెక్కన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో సమర్ధులైన నాయకుల పేర్లను రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకుంది. పలుమార్లు అంతర్గత సమావేశాలు నిర్వహించిన నేతలు.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తున్నారు.
రెండు చోట్ల పేరిచ్చిన శ్రవణ్
మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, నల్గొండ గ్రాడ్యుయేట్ మండలి స్థానానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మానవతారాయ్, బెల్లయ్యనాయక్ పేర్లను పరిశీలిస్తున్నారు. దాసోజు శ్రవణ్‌కుమార్ రెండింటిలో ఎక్కడిచ్చిన పోటీ చేస్తానని పేర్కొంటూ రెండు దరఖాస్తులు ఇచ్చారు.