'ఫోన్ ట్యాపింగ్'కు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందిరా పార్కు వద్ద సమావేశమై.. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్‌భవన్ చేరుకుని వినతి పత్రం అందజేస్తామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర రెడ్డి తెలిపారు. రాజ్‌భవన్ ముట్టడికి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు.
CHALO RAJ BHAVAN: నేడు రాజ్‌భవన్ ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు - congress chalo Raj Bhavan today
'ఫోన్ ట్యాపింగ్'కు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాజ్‌భవన్ ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు.
![CHALO RAJ BHAVAN: నేడు రాజ్‌భవన్ ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు నేడు రాజ్‌భవన్ ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12533067-1098-12533067-1626909278658.jpg)
నేడు రాజ్‌భవన్ ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు
మరోవైపు ఇందిరా పార్కు వద్ద సమావేశం నిర్వహించుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కాంగ్రెస్ నాయకుల పంథా ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Revanth Reddy: ఫోన్ల ట్యాపింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి