రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, ఉత్పన్నమైన పరిస్థితులపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - cm kcr on corona
రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానున్నారు.

రేపు రాష్ట్ర మంత్రవర్గ సమావేశం
లాక్‌డౌన్ పొడిగించే అంశం, ఆర్థిక పరిస్థితులు-భవిష్యత్ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు, వలస కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'