ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ స్పందించారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ ఎంత ఉపయోగకరమో ప్రజలు రాబోయే రోజుల్లో తెలుసుకుంటారని బండి సంజయ్ తెలిపారు. ఆర్థికవ్యవస్థకు భారతీయ రిజర్వు బ్యాంక్, కేంద్రప్రభుత్వం రెండు కళ్లని ఆర్‌బీఐ ద్రవ్య విధాన సూత్రీకరణతో వహరిస్తుందన్నారు.
'కేసీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ తాజా వార్తలు
భూస్వామ్య విధానం, ఫ్యూడల్ స్వభావం గురించీ కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్యాకేజీ ఎంత ఉపయోగకరమో ప్రజలు రాబోయే రోజుల్లో తెలుసుకుంటారన్నారు.
కేసీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి
రాష్ట్రాలకు నేరుగా నగదు అందించడం అన్న అంశంపై 2019 మార్చిలో ఆర్బీఐ కొత్త నిబంధనలు ఉండాలని ప్రతిపాదించిందని బండి సంజయ్ తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీఎస్డీపీలో 3 శాతం వరకూ మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం ఉండేదని తాజాగా కేంద్ర ప్రభుత్వం దాన్ని 5 శాతానికి పెంచిందని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పెంచటంపై కేసీఆర్ అసంబద్ధమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష
Last Updated : May 20, 2020, 12:02 PM IST