కరోనా నివారణకు ఎంత ఖర్చు చేశారు: బండి సంజయ్ - సీఎంకు బండి సంజయ్ లేఖ
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. కరోనా నివారణకు ప్రభుత్వం చేసిన ఖర్చును ప్రజలకు చెప్పాలని లేఖలో పేర్కొన్నారు.
కరోనా నివారణకు ప్రభుత్వం చేసిన ఖర్చును ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తూ... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వైరస్ నివారణ కోసం రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తామని అసెంబ్లీలో చెప్పి.. రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రధానికి ఫోన్ లో చెప్పటం ద్వంద వైఖరి కాదా అని ప్రశ్నించారు. సీఎం సహాయనిధికి వచ్చిన విరాళాలను ప్రభుత్వం దాచిపెడ్తోందని ఆయన ఆరోపించారు. బేషజాలను పక్కన పెట్టి... ప్రధాని మాదిరిగా కరోనా నివారణపై ప్రతిపక్షాలతో కేసీఆర్ మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.