రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ గందరగోళానికి గురిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 'వరి-ఉరి... ప్రభుత్వ వైఖరి' నినాదంతో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఏ ఉద్దేశంతో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం అంటోందని ప్రశ్నించిన సంజయ్.... రైతులను తెరాస నేతలు గంరగోళంలోకి నెడుతున్నారంటూ ఆక్షేపించారు.
ఒక కలెక్టర్ ఏమో వరి వేయొద్దంటాడు.. వరి విత్తనాలు అమ్మితే సీజ్ చేస్తామంటారు.. ఇంకో కలెక్టర్ వరి వేయమంటాడు. ఇంకో మంత్రేమో వరి కొనమంటాడు.. మరో మంత్రి వరి కొంటామంటాడు... ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడడు. ముఖ్యమంత్రే సందిగ్ధంలో ఉంటాడు. ఆయనకే క్లారిటీ ఉండదు. వాళ్లకు కేంద్రం కొంటలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా లెటర్ ఇచ్చిందా..? ఉంటే బయటపెట్టు.. లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో పడుండు. రైతులు వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటారు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.
కేంద్రం నుంచి లేఖ తెప్పించండి..
బండి సంజయ్ దీక్షను తప్పుపట్టిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.... యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి లేఖ తెప్పించాలని భాజపాకు సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసిందన్న నిరంజన్ రెడ్డి.... ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టామని వివరించారు.
సెప్టెంబరు నెలలోనే లేఖ ఇచ్చారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్కూడా మేము కొనమని. మీ ప్రభుత్వమే.. సాక్ష్యాత్తు కేంద్ర మంత్రే ఆ మాట చెప్పారు. మేము కొనమని చెప్పిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం కొననట్లు... రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి రైతులపై ప్రేమలేనట్లు వీళ్లు డ్రామాలు కట్టడం ఏమిటి..? ప్రతి గింజా కొంటామని కేంద్ర చెప్పే వరకు మీరు దీక్ష చేయండి... అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష ప్రకటించు బండి సంజయ్... - నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి.
శ్వేతపత్రం విడుదల చేయాలి