దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు పలువురు నేతలు కలిశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారుల అండతో అధికార పార్టీ విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేస్తోందని ఫిర్యాదు పేర్కొన్నారు. పటిష్ట భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన సర్పంచ్‌ను అరెస్ట్ చేశారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
"హుజూర్‌నగర్"పై కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు - ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
హుజూర్‌నగర్ ఉపఎన్నిక పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని భాజపా బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
TAGGED:
bjp leaders laxman