ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షలపై, కేంద్రంపై చేసిన అసత్య ప్రచారాలను భాజపా ఖండించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగటానికి సీఎం కేసీఆరే కారణమని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. అసదుద్దీన్ ఒత్తిడితోనే మర్కజ్ వెళ్ళొచ్చిన వారికి కరోనా పరీక్షలు చేయట్లేదన్నారు. కరోనా నియంత్రణకు 7వేల కోట్ల రూపాయలను కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం కమీషన్లు తినడం వల్లే తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసమే మెగా కృష్ణారెడ్డితో ఫిక్సింగ్ టెండర్లు వేయించారన్నారు. ప్రతిపక్షాలపై తన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కరీంనగర్ గడియారం వద్దకు...
చేతకాని నెపాన్ని కేంద్రంపై వేయటం సీఎం కేసీఆర్కు అలవాటుగా మారిందని నేతలు చింతల రామచంద్రా రెడ్డి, పొంగులేటి సుధాకర్ మండిపడ్డారు. అన్ని రోజులు ఒకేలా ఉండవనే విషయాన్ని సీఎం కేసీఆర్ గ్రహించకపోవటం హాస్యాస్పదమన్నారు. అతి త్వరలోనే కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై చర్చకు సీఎం కేసీఆర్... కరీంనగర్ గడియారం వద్దకు రావాలని సవాల్ విసిరారు.