కేంద్రం... ఉన్నతస్థాయి బృందాన్ని రాష్ట్రానికి పంపడాన్ని భాజపా రాష్ట్ర శాఖ స్వాగతిస్తోందని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్లో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రాష్ట్రానికి ఉన్నతస్థాయి బృందాన్ని పంపాలని కోరినట్లు వెల్లడించారు.
కరోనా పరీక్షల విషయంలో గుట్టురట్టు చేయాలి: లక్ష్మణ్ - రాష్ట్రానికి కేంద్ర ఉన్నత స్థాయి బృందం
హైదరాబాద్లో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్. కరోనా నియంత్రణను పరిశీలించేందుకు కేంద్రం... ఉన్నతస్థాయి బృందాన్ని రాష్ట్రానికి పంపడాన్ని ఆయన స్వాగతించారు.

కరోనా పరీక్షల విషయంలో గుట్టురట్టు చేయాలి: లక్ష్మణ్
భాజపా రాష్ట్ర శాఖ చేసిన వినతులను పరిగణలోకి తీసుకుని కేంద్రం ఉన్నతస్థాయి బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై గుట్టురట్టు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నందున పరీక్షల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:మీ ఓటు వద్దు... ప్రేమానురాగాలు చాలు: మంత్రి పువ్వాడ