SBI Property Show:హైదరాబాద్‌లో ఈ నెల 26, 27న ఎస్బీఐ ఆధ్వర్యంలో స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శన జరుగుతోందని బ్యాంకు జనరల్ మేనేజర్ జోగేష్ చంద్ర సాహు, డిప్యూటీ జనరల్ మేనేజర్ రవీంద్ర హితనాలి తెలిపారు. ఈ ఎక్స్పోలో దాదాపు 50కి పైగా స్థిరాస్తి ప్రాజెక్టులకు చెందిన ఆస్తులను స్టాల్స్ ద్వారా ప్రదర్శిస్తామని వివరించారు. రాష్ట్రంలో గృహరుణాలల్లో ఎస్బీఐ వాటా 32శాతం ఉండగా, హైదరాబాద్ నగరంలో 21శాతంగా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 44 వేల 580 కోట్లు గృహరుణాలు ఇచ్చామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రుణాలు మంజూరు చేశామని వివరించారు.
'గృహరుణాలివ్వడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే ముందంజలో ఉంది. హైదరాబాద్‌లో సైతం ఎస్‌బీఐ అగ్రపథంలో దూసుకెళుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే దేశంలో ట్రిలియన్ గృహరుణాలు మంజూరుచేశాం. తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా 10 వేల కోట్లుపైన పంపిణీ చేశాం. బ్యాంకు కార్యకలాపాలన్నీ డిజిటల్ లావాదేవీల రూపంలో జరపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. టాప్‌అప్ లోన్ కోసం బ్యాంకు శాఖను సందర్శించకుండానే యోనో యాప్‌లో దరఖాస్తు చేస్తే మంజూరు చేస్తున్నాం.' - జోగేష్ చంద్ర సాహు, ఎస్బీఐ జనరల్ మేనేజర్