గాంధీభవన్‌లో రెండో రోజు కాంగ్రెస్ నేతల అభిప్రాయ సేకరణ ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షుల నుంచి నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ అభిప్రాయాలను తెలుసుకున్నారు.
బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు 65 మంది నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. శుక్రవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీ చేసిన వాళ్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుల నుంచి అభిప్రాయ సేకరిస్తారు.