తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్కువ ఖర్చులో స్మార్ట్​ వెంటిలేటర్​... ముందుకొచ్చిన స్టార్టప్​ - coronavirus latest news

కరోనా నేపథ్యంలో పెరుగుతోన్న వెంటిలేటర్ల డిమాండ్​ను తీర్చేందుకు స్మార్ట్​ ధ్యానా అనే అంకురం ముందుకొచ్చింది. 5వేల రూపాయల ఖర్చుతోనే వెంటిలేటర్​ తయారీ మోడల్​ను రూపొందించి కేటీఆర్​, ప్రధాని నరేంద్రమోదీలకు ట్విట్టర్​ ద్వారా తెలియజేశారు.

startup came to forward for manufacturing of smart ventilator
తక్కువ ఖర్చులో స్మార్ట్​ వెంటిలేటర్​... ముందుకొచ్చిన స్టార్టప్​

By

Published : Apr 3, 2020, 1:54 AM IST

కరోనా విస్తరణతో వెంటిలేటర్లకు పెరుగుతోన్న డిమాండ్​ను తీర్చేందుకు... తక్కువ ఖర్చులోనే స్మార్ట్ వెంటిలేటర్ తయారీ ఆలోచనను పంచుకునేందుకు హైదరాబాద్​కు చెందిన స్టార్టప్ ముందుకొచ్చింది. నగరానికి చెందిన స్మార్ట్ ధ్యానా అనే అంకురం త్రీడీ ప్రింటింగ్, గృహ సంబంధ ఉపకరణాలతో 5 వేల రూపాయలతోనే వెంటిలేటర్ తయారీ మోడల్​ను రూపొందించింది. రాష్ట్రం, దేశం వెంటిలేటర్ డిమాండ్​ను చవిచూస్తున్న ప్రస్తుత తరుణంలో.. తమ ఈ మోడల్ ఇందుకు పరిష్కారాన్ని చూపుతుందని అంకుర నిర్వాహకులు కేటీఆర్, నరేంద్రమోదీలకు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

తక్కువ ఖర్చులో స్మార్ట్​ వెంటిలేటర్​... ముందుకొచ్చిన స్టార్టప్​

ఇందుకు సంబంధించిన వెంటిలేటర్ పని విధానాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. ట్వీట్​కు స్పందించిన కేటీఆర్.. వెంటిలేటర్ నమూనా, డెమోతో తమను సంప్రదించాలని వారిని కోరారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ, టీహబ్, టీవర్క్స్​, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్​ను వీరితో సంప్రదింపులు జరపాలని సూచించారు.

తక్కువ ఖర్చులో స్మార్ట్​ వెంటిలేటర్​... ముందుకొచ్చిన స్టార్టప్​

ఇవీ చూడండి:రాష్ట్రంలో 154కు చేరిన కరోనా కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details