గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు శానిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. జంట నగరాల్లోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో... జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో శానిటైజేషన్ మొదలు
రాష్ట్రంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువ కొవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు శానిటైజేషన్ చేస్తున్నాయి. ఈరోజు పలు ప్రాంతాల్లోని కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో శానిటైజేషన్ మొదలు
హై రిస్క్ ఉన్న ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేషన్, యాంటి లార్వా స్ప్రేయింగ్ చేస్తున్నారు. 19 డిజాస్టర్ డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో ఇవాళ కూకట్ పల్లి, నిజాంపేట్, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లో రోడ్లు, ఇతర కాలనీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌తో శానిటైజ్ చేశారు.
ఇదీ చూడండి :'లంగ్స్పై భారీ స్థాయిలో కరోనా 2.0 దెబ్బ!'