తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం - bus service started in ap

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఏపీ ఆర్టీసీకి ఉన్న 12 వేల బస్సుల్లో 17 శాతం బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

start-of-rtc-bus-services-in-andhrapradesh
ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

By

Published : May 21, 2020, 8:55 AM IST

ఆంధ్రప్రదేశ్​లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. దాదాపు 2 నెలల అనంతరం ఏపీ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తొలిరోజు 1,683 బస్సులు తిరిగేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏపీ ఆర్టీసీకి ఉన్న 12 వేల బస్సుల్లో 17శాతం బస్సులనే నడుపుతున్నారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా అధికారులు తగిన చర్యలు చేపట్టింది. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లోకి సిబ్బంది అనుమతిస్తోంది. ప్రయాణికుల కోసం శానిటైజర్లను ఏర్పాటు చేశారు.

ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details