Womens night Run: మహిళా సాధికారత అనేది మహిళల స్వీయ-విలువ భావాన్ని, వారి సొంత ఎంపికలను నిర్ణయించే సామర్థ్యాన్ని వారి కోసం, ఇతరుల కోసం సామాజిక మార్పును ప్రభావితం చేసే హక్కును ప్రోత్సహించడం. అలాంటి మహిళా సాధికారత థీమ్‌గా హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ నిర్వహించిన మారథాన్ ఉత్సాహంగా సాగింది.
గచ్చిబౌలి స్టేడియం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 5కే, 10కే రన్‌ను నిర్వహించారు. ఈ మారథాన్‌లో చిన్నారులు, పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా సాధికారత వైపు పరుగులు తీస్తామంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దేశంలో మహిళలందరూ రాత్రిపూట స్వేచ్ఛగా, భయంలేకుండా బయట తిరిగే రోజులు రావాలని కోరుతూ.. మహిళా సాధికారతపై అవగాహన కల్పిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో తాము కూడా పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందని మహిళా రన్నర్స్ తెలిపారు.