తెలంగాణ

telangana

ETV Bharat / state

'వీధి వ్యాపారుల రుణాలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు' - Stamp duty exceptions news

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, వీధి వ్యాపారుల రుణాలకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

'వీధి వ్యాపారుల రుణాలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు'
'వీధి వ్యాపారుల రుణాలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు'

By

Published : Aug 7, 2020, 9:38 PM IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, వీధి వ్యాపారుల రుణాలకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందువల్ల లక్ష ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలు, 3.5 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని సర్కారు వెల్లడించింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలురూ. 1000, వీధి వ్యాపారులు రూ. 400 లెక్కన స్టాంపు డ్యూటీ చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రాగా... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్పందించారు.

గురువారం బ్యాంకర్లతోపాటు పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల ఉన్నతాధికారులతో వీడియా కాన్ఫరెర్స్‌ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యపై సమీక్ష చేశారు. ఏలాంటి పూచీకత్తు లేకుండా.. వీధి వ్యాపారులకు రూ. 10వేలు రుణాలు ఇవ్వాలని, ఎంఎస్‌ఎంఇలు కరోనా ముందు తీసుకున్న రుణాలపై 20శాతం రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారులకు రూ. 350 కోట్లు, ఆత్మ నిర్బర్‌ భారత్‌ స్కీం కింద ఎంఎస్‌ఎంఇలకు రూ. 7,300 కోట్లు రుణాలు అందే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. స్టాంపు డ్యూటీ మినహాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఈ ఏడాది అక్టోబరు 31 వరకు అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్‌ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్టాంపు డ్యూటీ మినహయింపు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details