తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వే ప్రాజెక్టులకు వాటాల చిక్కుముడి.. నత్తనడకన సాగుతున్న పనులు

Delay in Construction of Railway Projects in Telangana: తెలంగాణలోని పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాల చిక్కుముడి, భూసేకరణ అంశాల లాంటివి జాప్యం చేస్తున్నాయి. దాంతో నిర్మాణంలో ఉన్న 13 ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సరిగా ఇవ్వడం లేదంటూ కేంద్రం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్​లో తగినన్ని నిధులు కేటాయించట్లేదని రాష్ట్రం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Railway Projects
Railway Projects

By

Published : Apr 10, 2023, 10:40 AM IST

Delay in Construction of Railway Projects in Telangana : రాష్ట్రంలోని పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాల చిక్కుముడి, భూసేకరణ అంశాలు.. జాప్యం చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో కొన్ని ప్రాజెక్టులకు తగినన్ని నిధుల కేటాయింపు జరగడం లేదు. మరికొన్నింటికి రాష్ట్ర సర్కార్​ తమ వాటాను సరిగా ఇవ్వడం లేదని రైల్వేశాఖ పేర్కొంటోంది. తెలంగాణలో 13 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా.. ఇంకా 177 హెక్టార్ల రెవెన్యూ, 15 హెక్టార్ల అటవీ భూములను రాష్ట్ర సర్కార్ సేకరించి ఇవ్వాల్సి ఉందని వెల్లడించింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వ వాటాగా ఇంకా రూ.986 కోట్ల నిధులు రావాలని రైల్వేశాఖ చెబుతోంది.

తెలంగాణలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంటులో వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న 13 (కొత్తవి 8, డబ్లింగ్‌ 5) ప్రాజెక్టుల విలువ గతేడాది ఏప్రిల్‌ నాటికి రూ.30,062 కోట్లుగా ఆయన తెలిపారు. ఆయా రైల్వే లైన్ల దూరం 2,390 కి.మీ. కాగా.. అందులో కేవలం 272 కి.మీ. మేర మాత్రమే రైలుమార్గం పూర్తయిందని పేర్కొన్నారు. 8 కొత్త లైన్ల దూరం 1,053 కి.మీ.లు కాగా అంచనా వ్యయం రూ.16,686 కోట్లుగా అధికారులు స్పష్టం చేశారు. దానిలో రూ.3,596 కోట్ల మేర 220.5 కి.మీ. మార్గం నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు. అదే విధంగా 5 డబ్లింగ్‌ ప్రాజెక్టుల దూరం 1,337 కి.మీ. కాగా అంచనా వ్యయం రూ.13,376 కోట్లుగా తెలిపారు. అందులో రూ.2,918 కోట్ల విలువైన 51.5 కి.మీ. మార్గమే పూర్తయిందని రైల్వే శాఖ పేర్కొంది.

17 ఏళ్లుగా పూర్తి కాని ‘మనోహరాబాద్‌-కొత్తపల్లి’ రైలుమార్గం :తెలంగాణలో ప్రధానమైన మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలుమార్గం 2006-07లో మంజూరైంది. ఆ రైల్వే లైను 151 కి.మీ.లకు గాను 44 కి.మీ.లు మాత్రమే పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూసేకరణతో పాటు మూడోవంతు వాటా ఇవ్వాలి. అయితే మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడం లేదు. రైల్వేవర్గాలు మాత్రం తెలంగాణ ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో జాప్యమే కారణమని పేర్కొంటున్నాయి.

*తెలంగాణలో చేపడుతున్న మనోహరాబాద్‌-కొత్తపల్లి, అక్కన్నపేట-మెదక్‌, భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి, భద్రాచలం రోడ్‌-కొవ్వూరు, హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2లతో కలిపి ఈ 5 ప్రాజెక్టుల విలువ రూ.7,350 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.2,588 కోట్లు ఖర్చు పెట్టినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాష్ట్ర సర్కార్ తమ వాటా కింద రూ.1,279 కోట్లు జమ చేసిందని.. మరో రూ.986 కోట్లు జమ చేయాలని ఆయన పేర్కొన్నారు.

* నగరంలో చేపడుతున్న ఎంఎంటీఎస్‌-2వ దశకు గాను రూ.816.55 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 544.36 కోట్లుగా ఉంది. అయితే రూ.279.02 కోట్లు మాత్రమే చెల్లించిందని మిగిలిన నిధుల కోసం పలుమార్లు లేఖ రాసినా స్పందన లేదని రైల్వే మంత్రి వైష్ణవ్ చెబుతున్నారు. 1997-98లో మంజూరైన మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌ (కర్ణాటక) కొత్త లైను ప్రాజెక్టు పాతికేళ్లయినా నేటి వరకు అందుబాటులోకి రాలేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details