తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫలించిన కేసీఆర్‌ కృషి.. ప్రాంతీయ భాషల్లోనూ ఎస్ఎస్​సీ పరీక్షలు - ప్రాంతీయ భాషల్లోనూ ఎస్​ఎస్​సీ పరీక్షలు

Staff Selection Commission Exams in Regional Languages: ప్రధానికి కేసీఆర్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంగ్లం, హిందీతోపాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్​లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

SSC Exams in Regional Languages
SSC Exams in Regional Languages

By

Published : Jan 22, 2023, 9:44 AM IST

SSC Exams in Regional Languages: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆంగ్లం, హిందీతో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందని సీఎం కార్యాలయం శనివారం తెలిపింది. రైల్వేలు, రక్షణ బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను హిందీ, ఆంగ్ల భాషల్లో నిర్వహించడం వల్ల ఇతర భాషా పరిజ్ఞానం గల విద్యార్థులు నష్టపోతున్నారని కేసీఆర్‌ 2020 నవంబరు 18న ప్రధానికి లేఖ రాశారు.

అన్ని భాషల్లో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దానిపై కేంద్రం ఎట్టకేలకు దిగి వచ్చిందని, అన్ని భాషల్లో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించిందని సీఎం కార్యాలయం తెలిపింది. కేసీఆర్‌ చొరవతో కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details