వైద్యారోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల ఉద్యోగ నియామక పరీక్ష మెరిట్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్లో 3, 311 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం 2018 మార్చి 11న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్ష రాసిన 21,391 మంది మెరిట్ వివరాలను వెబ్సైట్లో పొందుపరచింది.
స్టాఫ్ నర్సుల నియామక పరీక్ష మెరిట్ జాబితా విడుదల - హైదరాబాద్ తాజా వార్తలు
ప్రజారోగ్య శాఖ, వైద్య విదాన పరిషత్లో స్టాఫ్ నర్సుల ఉద్యోగ నియామక పరీక్ష మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 19 వరకు ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
![స్టాఫ్ నర్సుల నియామక పరీక్ష మెరిట్ జాబితా విడుదల Staff Nurses Recruitment Examination Merit List Released by tspsc commission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9470649-303-9470649-1604766508433.jpg)
స్టాఫ్ నర్సుల నియామక పరీక్ష మెరిట్ జాబితా విడుదల
రాత పరీక్ష ఫలితాలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడించింది. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. ఈ నెల 13 నుంచి 19 వరకు ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండిఃసీటెట్ పరీక్ష కేంద్రాల్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం