తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్ విధుల్లో ఉన్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి'

కొవిడ్ విధుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వైద్యారోగ్య సంఘాల ఐక్య వేదిక కోరింది. ఈ విషయమై సీఎం కేసీఆర్(CM KCR) దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని... ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంత్రులు హరీశ్​ రావు(Harish rao), జగదీశ్​ రెడ్డి(jagadeesh reddy), ఎమ్మెల్యేలు, 33 జిల్లాల జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందించారు.

covid duty staff problems
'కొవిడ్ విధుల్లో ఉన్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి'

By

Published : Jun 7, 2021, 10:14 PM IST

కొవిడ్ విధుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని.. వైద్యారోగ్య సంఘాల ఐక్య వేదిక కోరింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్(CM KCR) దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని... ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంత్రులు హరీశ్​ రావు(Harish rao), జగదీశ్​ రెడ్డి(jagadeesh reddy), ఎమ్మెల్యేలు, 33 జిల్లాల జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు.

హెల్త్ కేర్ వర్కర్స్ ఇంట్లో అందరికీ టీకా వేయాలని... కరోనా విధుల్లో చనిపోయిన వారికి ఒక కోటి నష్టపరిహారం చెల్లించాలని వేదిక ప్రతినిధులు కోరారు. వారి కుటుంబంలో అర్హులైన ఒకరికి వారి అర్హతకు తగ్గ ఉద్యోగం నెల రోజుల వ్యవధిలో కల్పించాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బందికి ఇంతకు ముందు ఇచ్చినట్టుగా 10 శాతం కొవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసి పని ఒత్తిడి తగ్గించాలని తెలిపారు. 2017లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకమైన వైద్య సిబ్బందికి ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్స పొందిన హెల్త్ కేర్ వర్కర్స్​కు స్పెషల్​ ట్రీట్​మెంట్ అందించాలన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,933 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details