హైదరాబాద్ ముషీరాబాద్ వ్యాక్సినేషన్ కేంద్రం(covid vaccine centre)లోకి వచ్చే వాహకులకు( జీహెచ్ఎంసీ(GHMC) రోజుకో కొత్త విధానాన్ని అమలు చేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్యులు వారిని మరింత ఇక్కట్లకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తొమ్మిది కేటగిరీలకు సంబంధించిన సూపర్ స్ప్రెడర్ల(super spreader)కు… ప్రధానంగా మూడు రోజులపాటు టోకెన్ విధానాన్ని అమలు చేశారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విధానాన్ని తీసుకువచ్చారు. రోజుకో కొత్త విధానాన్ని తీసుకురావడంతో జీహెచ్ఎంసీ(GHMC) సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది మధ్య సమన్వయ లోపం వల్ల… అడ్డదారిలో వ్యాక్సిన్ వేయించుకోవడం వంటి సంఘటనలు విస్తృతంగా చోటుచేసుకుంటున్నాయి.
covid vaccine centre: సిబ్బంది సమన్వయ లోపం.. వాహకులకు ఇబ్బందులు! - జీహెచ్ఎంసీ
హైదరాబాద్ ముషీరాబాద్ వ్యాక్సినేషన్ సెంటర్(covid vaccine centre)లో రోజుకో కొత్త విధానాన్ని అమలు చేయడంతో వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అడ్డదారి వ్యాక్సిన్ వినియోగాన్ని నియంత్రించడానికి సరికొత్తగా జీహెచ్ఎంసీ(GHMC) సిబ్బంది చేత పని ప్రాంతాల్లోనే వారి వివరాల నమోదును ప్రారంభించారు. దీంతో జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్యుల సమన్వయ లోపంతో వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.
covid vaccine centre: సిబ్బంది సమన్వయ లోపం.. వాహకులకు ఇబ్బందులు
అడ్డదారి వ్యాక్సిన్ వినియోగాన్ని నియంత్రించడానికి సరికొత్తగా జీహెచ్ఎంసీ సిబ్బంది చేత పని ప్రాంతాల్లోనే వారి వివరాల నమోదును చేపట్టారు. అయినప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే కొంతమంది సిబ్బంది… జీహెచ్ఎంసీ(GHMC) కింది స్థాయి సిబ్బంది చేతివాటంతో అడ్డ దారిలో వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల… నియంత్రణ చేయలేక పోతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.