నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2... ప్రయోగం విజయవంతం
10:06 February 10
నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2... ప్రయోగం విజయవంతం
SSLV-D2 Launch is Successful: చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమై.. 6.30 గంటలపాటు కొనసాగింది. అనంతరం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి బయలుదేరింది. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు యూఎస్‌ఏ అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07, 880 సెకన్లకు జానుస్-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీశాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఇవీ చదవండి: