ఈనెల 19 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్టికెట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు ఆన్లైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఫీజు చెల్లించలేదనో... ఇతర కారణాలతోనో యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వక పోతే.. నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు.
ఆన్లైన్లో పదోతరగతి హాల్టికెట్లు - ssc hall tickets in online
పదో తరగతి పరీక్షలకు హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే పాఠశాలలకు హాల్టికెట్లు పంపించామని... అక్కడి నుంచి విద్యార్థులు తీసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సత్యనారాయణ రెడ్డి సూచించారు.
ఆన్లైన్లో పదోతరగతి హాల్టికెట్లు
హాల్ టికెట్లు bse.telangana.gov.in అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల 34వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 2,530 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు.