తెలంగాణలో ఈనెల 23 నుంచి నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: పదో తరగతి పరీక్షలు వాయిదా
కరోనా సెగ తెలంగాణలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సైతం తగిలింది. ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వెల్లడించారు.
SSC Exams
రేపు జరగాల్సిన పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని ఆమె తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'ఇంటర్ పేపర్ మూల్యాంకనం వాయిదా వేయాలి'