సూర్య గ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు ఆదివారం దర్శనం ఉండదని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. అందువల్ల శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేసి.. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెరుస్తారు.
తిరుమలలో శ్రీవారి దర్శనాలు రద్దు - తిరుమలలో శ్రీవారి దర్శనాలు రద్దు
సూర్య గ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు ఆదివారం దర్శనం ఉండదని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది.
తిరుమలలో శ్రీవారి దర్శనాలు రద్దు
శ్రీవారికి రోజువారి కైంకర్యాలను జరిపి... రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. కైంకర్యాల నిర్వహణలో భాగంగా భక్తులకు దర్శనం ఉండదు.
ఇదీ చూడండి :యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సాంకేతిక బృందం