Srivari Vahana services start in Tirumala: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఇవాళ శ్రీవారి వాహన సేవలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సూర్యోదయ వేళ స్వామి వారు.. మలయప్పస్వామి రూపంలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ.. భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఐదున్నర గంటలకు వాహన మండపం నుంచి బయలుదేరినా శ్రీవారు వాయువ్య దిశకు చేరుకున్నారు.
అక్కడ భానుని కిరణాలు స్వామి వారి పాదాలకు తాకిన అనంతరం అర్చకులు హారతులు, ప్రత్యేక నైవేద్యాలను సమర్పించి.. వాహన సేవను ప్రారంభించారు. అత్యంత పవిత్రమైన రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అనేక ప్రాంతాలు నుంచి గతరాత్రే తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమలలోని గ్యాలరీలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుడిని దర్శించుకున్న భక్తులు..కర్పూరహారతులతో స్వామివారికి నీరాజనాలు సమర్పించారు.
ఇవీ చదవండి