హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 18న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 26న ముగియనున్నాయి.
వనస్థలిపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు - Hyderabad Vanasthalipuram News
వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనులవిందుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందరికీ ఆ స్వామివారి కృప ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
అందులో భాగంగా రోజు జరిగే కార్యక్రమాలు ఆగమశాస్త్ర ప్రకారం మూలమూర్తికి అష్టోత్తర శత రజిత కలశ పంచామృత స్నపన తిరుమంజనం, 108 వెండి కలశాలతో అభిషేకం, కుంకుమార్చన, హోమాలు, దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కరోనా.. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరదనీటి కష్టాలులాంటి సమస్యల నుంచి కోలుకోవాలని.. అందరికీ ఆ స్వామి వారి కృప ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ కార్యదర్శి మురళీధర్ తెలిపారు.
ఇదీ చదవండి:తిరుమలలో వైభవంగా చంద్రప్రభ వాహన సేవ