ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో కె.ఎస్ రామరావు తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
శ్రీశైలంలో వారంరోజుల పాటు దర్శనాల నిలిపివేత - శ్రీశైలంలో ముగ్గురు భద్రతా సిబ్బందికి కరోనా
ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో రోజురోజుకు కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో కె.ఎస్ రామరావు తెలిపారు.
శ్రీశైలంలో వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత
ఆలయంలో విధులు నిర్వహించే ఇద్దరు పరిచారకులు, ముగ్గురు భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ... స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలను ఏం చేస్తారంటే..