ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో... భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. దర్శనాలకు రానున్న భక్తుల కోసం ఆలయ క్యూలైన్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు క్యూలైన్లోకి ప్రవేశించగానే చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు.
శ్రీశైల మల్లన్న దర్శనానికి ముమ్మరంగా ఏర్పాట్లు - srishailam temple latest updates
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. పర్యాటకశాఖ, హరిత రిసార్ట్స్‌లో ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.
![శ్రీశైల మల్లన్న దర్శనానికి ముమ్మరంగా ఏర్పాట్లు srishailam temple darshanam arrangements](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7502630-1066-7502630-1591440675998.jpg)
ముమ్మరంగా శ్రీశైల మల్లన్న దర్శన ఏర్పాట్లు
దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికిి థర్మల్ స్కానింగ్ పరీక్షలు చేసిన తర్వాతే అనుమతించాలని ఆలయ ఈఓ కె.ఎస్ రామారావు అధికారులను ఆదేశించారు. దేవాలయంలో భక్తులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి :దక్షిణ అయోధ్యలో దర్శనాలకు వేళాయే..
TAGGED:
srisailam temple latest news