శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద... స్పిల్‌వే గేట్లన్నీ మూసివేత - srishailam water levels
శ్రీశైలం జలాశయం స్పిల్‌వే గేట్లన్నింటినీ అధికారులు మూసేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా తగ్గిపోవటం వల్ల గేట్లు మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
srishailam gates stoped due to decreased of floods
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా తగ్గటం వల్ల స్పిల్‌వే గేట్లన్నీ మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 73,583 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 30, 986 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.20అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.99 టీఎంసీలకు చేరింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.