శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్ర ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో హైదరాబాద్కు చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈ మోహన్ కుమార్, ఏఈ ఫాతిమా మృత దేహాలు నగరానికి చేరుకున్నాయి. డీఈ శ్రీనివాస్ మృతితో చంపాపేటలోని తన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. విధులు ముగించుకుని ఉదయం ఇంటికి రావాల్సిన అతను విగతజీవిగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వెలుగులు నింపిన ఇంట.. కారు చీకట్లు - Srisailam Incendet Dead Bodies
జనాలకు వెలుగులు పంచిన చిరుదివ్వెలు వారు. అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతులయ్యారు. విధి నిర్వహణలో బలైపోయి... కుటుంబసభ్యులకు దూరంగా అనంతలోకాలకు తరలిపోయారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదం... నిండు జీవితాలను కాలగర్భంలో కలిపేసింది.
వెలుగులు నింపిన ఇంట.. కారు చీకట్లు
మరో వైపు మేడ్చల్ జిల్లా సుచిత్రా భాగ్యలక్ష్మి కాలనీలోని ఏఈ మోహన్ కుమార్ ఇంటి వద్ద రోదనలు మిన్నంటాయి. మృతదేహనికి ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతుల్లో మరో ఏఈ ఫాతిమా మృతదేహనికి కుటుంబ సభ్యులు అజంపురాలోని స్మశాన వాటికలో గత రాత్రి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇవీచూడండి:ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?