శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. ఆదివారం జలాశయం నీటిమట్టం 811.90 అడుగులు, నీటి నిల్వ 35.4269 టీఎంసీలకు చేరింది. జలాశయంలో నీరు 28 టీఎంసీలకు చేరుకోగానే డెల్టా స్టోరేజీగా పరిగణిస్తారు. ఈ ప్రకారం ఇంకా 7 టీఎంసీల నీరు విద్యుద్ ఉత్పత్తి, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. జూన్‌లో ప్రారంభం కానున్న వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల జలాశయాలకు ఆశించిన విధంగా నీరు వస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు.
కనిష్ఠ స్థాయికి శ్రీశైలం నీటిమట్టం - శ్రీశైలంలో నీటి నిల్వ
ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుతుండటం వల్ల... విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది.
![కనిష్ఠ స్థాయికి శ్రీశైలం నీటిమట్టం srisailam-dam-water-level-raises-to-minimum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7334517-546-7334517-1590368314937.jpg)
కనిష్ఠ స్థాయికి శ్రీశైలం నీటిమట్టం