హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఆబ్కారీశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీ, అబ్కారీశాఖలో బదిలీలు, పదోన్నతులపై చర్చించారు.
గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించినా... శాశ్వత అంగవైకల్యం చెందినా ఇచ్చే పరిహారం విషయంలో సులభతర నిబంధనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వారంలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నందనవనంలో నీరా ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. నిర్మాణ సంబంధిత టెండర్ ప్రక్రియ, ఇతర అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆబ్కారీశాఖలో ఇన్స్‌స్పెక్టర్ నుంచి అదనపు కమిషనర్ స్థాయి అధికారుల పదోన్నతులపై చర్చించారు. పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి కొత్త సంవత్సరంలో అందరికీ పోస్టింగులు, బదిలీలు చేపట్టాలని ఆదేశించారు. డీపీసీలోకి వచ్చే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
ఇవీచూడండి:వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం