రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) ఆర్థిక స్వావలంబన కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ కార్యకలాపాలు చేపట్టాలని స్త్రీనిధి సహకార ఫెడరేషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పొదుపు సంఘాలకు పాడిపశువులను అందజేయనున్నారు. స్త్రీనిధి అధ్యక్షురాలు అనిత అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) విద్యాసాగర్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
పొదుపు సంఘాలకు పాడిపశువులు - పొదుపు సంఘాలు
పొదుపు సంఘాలకు పాడిపశువులు అందజేయాలని స్త్రీనిధి సహకార ఫెడరేషన్ నిర్ణయించింది. స్త్రీనిధి అధ్యక్షురాలు అనిత అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) విద్యాసాగర్ రెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
పొదుపు సంఘాలకు పాడిపశువులు
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ..
- * ఒక్కో పశువుకు రూ.75 వేల చొప్పున 50 వేల మేలుజాతి ఆవులు, గేదెల కొనుగోలు నిమిత్తం స్వయం సహాయక సభ్యులకు రుణాలు అందజేస్తారు. పశువులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తారు.
- * ఒక్కో ఎస్‌హెచ్‌జీ యూనిట్‌కు 50 నుంచి 100 కోళ్లు కొనుగోలు చేసేందుకు వీలుగా రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకూ రుణం ఇస్తారు.
- * పర్యావరణహితంగా ఉండేలా.. ఒక్కో జిల్లాకు 30 చొప్పున మొత్తం వెయ్యి ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణం అందిస్తారు.
- * రైతులకు వ్యవసాయ పరికరాలు అద్దెకు ఇచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా 100 కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఒక్కో మండల సమాఖ్యకు రూ.25 లక్షల మేర రుణం ఇస్తారు.
- * స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు స్త్రీనిధి సురక్ష పథకం కింద బీమా సదుపాయం కల్పిస్తారు. ఏడాదికి రూ.230 చొప్పున మూడేళ్లకు రూ.690 కట్టి ఈ పథకంలో చేరవచ్చు. సంబంధిత మొత్తాన్ని సంఘం ద్వారా రుణం రూపంలో పొందొచ్చు. ఒకవేళ సభ్యురాలు మరణిస్తే వారసులకు రూ.లక్ష పరిహారం అందుతుంది.
- * స్త్రీనిధి ద్వారా మంజూరు చేసే రుణాన్ని ఇకమీదట సంఘం ఖాతాలో కాకుండా నేరుగా సభ్యురాలి పొదుపు ఖాతాలో జమచేస్తారు. దీన్ని తొలుత కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపడతారు.
ఇదీ చదవండి:పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే విజయం: కేటీఆర్