రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీలంకకు చేరింది. స్వదేశం విదేశం అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ డీ వెంకటేశ్వరన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్ పార్కులో మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు... పర్యావరణ పరిరక్షణకు నిరంతర కార్యక్రమాలు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెంకటేశ్వరన్ పేర్కొన్నారు.
సమాజం కోసం నేను అనే మహోన్నత ఆశయంతో జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ప్రకృతి విలయాలతో విలవిల్లాడుతున్న నేటి ప్రపంచానికి ఆవశ్యకమైందని డాక్టర్ డీ వెంకటేశ్వరన్ తెలిపారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని పరిచయం చేసిన సంతోష్‌కుమార్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.