సికింద్రాబాద్ సీతాఫల్మండిలో శ్రీకృష్ణా జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నామాలగుండులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణ ధరించారు. మరికొందరు కూచిపూడి, భరతనాట్యాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాలను దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ప్రకాష్ తెలిపారు.
సీతాఫల్మండిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు - కూచిపూడి
సికింద్రాబాద్ సీతాఫల్మండిలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వరాలయంలో చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయాధికారులు నిర్వహించారు.
సీతాఫల్మండిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు