సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం విషయంలో సామాజిక మాధ్యమాల్లో ఎవరూ వదంతులు సృష్టించవద్దని రజినీ తెలంగాణ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ దేచపల్లి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, డిసెంబర్ 31న నూతన పార్టీపై ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రజినీ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న శ్రీకాంత్.. శుక్రవారం నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వద్దే ఉంటూ అభిమానులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని, వాటన్నింటిని వెంటనే తొలిగించాలని కోరారు.