కరోనా వైరస్ వ్యాపితో ప్రజలు అల్లాడిపోతున్నారని.. తమను కాపాడాలని సముద్రం ఒడ్డున మత్స్యకార గ్రామాల ప్రజలు అభిషేకాలు చేశారు. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన మత్స్యకారులు తమ గ్రామాలకు క్షేమంగా రావాలని ప్రత్యేక పూజలు చేశారు. అన్ని దేవాలయాల తలుపులు మూసే ఉన్నాయని.. ఒక్క గంగమ్మ తల్లి తలుపులే తెరిచి ఉన్నాయని.. మహిళలు పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని కోరుతున్నారు.
కరోనా వైరస్ నుంచి రక్షించు తల్లి - సముద్రం ఒడ్డున కరోనా పూజలు న్యూస్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మత్స్యకార గ్రామాలకు చెందిన మహిళలు సముద్రం ఒడ్డున పూజలు చేశారు.
కరోనా వైరస్ నుంచి రక్షించు తల్లి