తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి: శ్రీధర్​ బాబు - విద్యుత్​ బిల్లులపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్​బాబు

మూడు నెలల విద్యుత్తు బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. కరోనా కష్టకాలంలో సామాన్యులపై ఈ కరెంట్​ బిల్లులు అదనపు భారమని ఆరోపించారు.

sridhar babu demands the telangana state government to cancel electricity bills for three months
బిల్లుల మదింపులో తప్పిదాలు... పేదలపై పెనుభారం

By

Published : Jun 9, 2020, 10:13 PM IST

కరోనా కాలంలో... విద్యుత్తు బిల్లులకు వడ్డీ కలిపి పేదలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు. మూడు నెలల కరెంట్​ బిల్లులను పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్​ చేశారు. మూడు నెలల కరెంట్​ బిల్లుల మదింపులో చోటు చేసుకున్న తప్పిదాలతో వేలల్లో కరెంట్​ బిల్లలు రావడం.. ఈ పరిస్థితుల్లో పేదలకు ఆర్థికంగా భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

జిల్లాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తామన్న మాట నిజం కాదా అన్నారు. గచ్చిబౌలిలో కోవిడ్ ప్రత్యేక హాస్పిటల్‌, జిల్లాలల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు ఎక్కడ అని ఆరోగ్య శాఖ మంత్రిని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details