కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు శ్రీవిజ్ఞాన్ ఎడ్యుకేషన్ సొసైటీ ముందుకొచ్చింది. కొవిడ్ కారణంగా అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు తమ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్, డిగ్రీ విద్యను అందిస్తామని సొసైటీ ఛైర్మన్ గౌరి సతీష్ తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్య - తెలంగాణ వార్తలు
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని శ్రీవిజ్ఞాన్ ఎడ్యుకేషన్ సొసైటీ తెలిపింది. ఎలాంటి బోధన రుసము లేకుండా చదివిస్తామని వెల్లడించింది.
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య, శ్రీవిజ్ఞాన్ ఎడ్యుకేషన్ సొసైటీ
హైదరాబాద్‌లోని బండ్లగూడ, అత్తాపూర్, శంషాబాద్‌లోని బ్రాంచీల్లో బోధన రుసుము తీసుకోకుండా చదివిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం 96522 84222 లేదా gourisatish4u@gmail.com ద్వారా సంప్రదించవచ్చునని సూచించారు.
ఇదీ చదవండి:Rythubandhu: రైతుబంధు కోసం మరో రూ.3 వేల కోట్ల రుణం తీసుకోనున్న ప్రభుత్వం