తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్​ను సందర్శించిన చినజీయర్ స్వామి - vizianagaram distric news today

ఏపీ విజయనగరం జిల్లాలోని శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్​ను త్రిదండి చినజీయర్ స్వామి సందర్శించారు. ట్రస్ట్ నిర్వాహకులు జగదీశ్​ చేస్తున్న సేవలను కొనియాడారు. తన వంతు సహాయంగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్​ను సందర్శించిన చినజీయర్ స్వామి
శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్​ను సందర్శించిన చినజీయర్ స్వామి

By

Published : Oct 2, 2020, 10:51 PM IST

ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్​ను త్రిదండి చినజీయర్ స్వామి సందర్శించారు. ట్రస్టు వ్యవస్థాపకుడు జగదీశ్​ మాతృమూర్తి అలివేలు మంగతాయారమ్మ జ్ఞాపకార్థం నెలకొల్పిన గోశాలను.. అహోబిలం జీయర్​స్వామితో కలసి ప్రారంభించారు. అనంతరం కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని సందర్శించి, తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసి, నిరుపేద వృద్ధులకు బియ్యం అందజేశారు.

ట్రస్టు నిర్వాహకులు జగదీశ్​ చేస్తున్న సేవలు ప్రశంసించదగినవని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ట్రస్ట్ సేవలకు.. పరిశ్రమలు, సంస్థలు ముందుకొచ్చి సహాయ అందించటం అభినందనీయమన్నారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయంగా రూ.10 లక్షల సాయం ప్రకటించారు.

ఇదీ చదవండి:సేవ మనిషి జీవితంలో భాగం కావాలి: చినజీయర్ స్వామి

ABOUT THE AUTHOR

...view details