తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు - ap news

ఏపీలోని విశాఖ శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవ వేడుకలు నాలుగో రోజు ఘనంగా జరిగాయి. స్వయంజ్యోతి మండపంలోని స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు.

shri sharada peetham
శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు

By

Published : Feb 20, 2021, 5:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాలుగు రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని స్వయంజ్యోతి మండపంలో స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు.

షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రాజశ్యామల యాగం, చతుర్వేద పారాయణలను వేద పండితులు నాలుగో రోజూ కొనసాగించారు. 80 మంది అర్చకులు వేదోక్తంగా యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్​ కృషితో దేవాలయాల అభివృద్ధి: ఇంద్రకరణ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details