శ్రీరామ నవమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. శ్రీ రామ నామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం శ్రీరామ నవమిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బెల్జియంలో తెలుగు వారంతా ఓ చోట చేరి.. శ్రీరామ నవమిని ఉత్సాహంగా జరుపుకున్నారు. సీతారామచంద్రులకు వైభవంగా కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ రామ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
శ్రీ రామనవమి తర్వాత రోజున పుష్యమి సందర్భంగా రామయ్యకు పట్టాభిషేకం సైతం ఘనంగా జరిపించారు. భక్తుల జయ జయ ధ్వానాలు, ఆటపాటలతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఎప్పుడూ తమ తమ పనుల్లో బిజీగా ఉండే వారంతా.. శ్రీ రామనవమి సందర్భంగా అంతా ఓచోట చేరి కాసేపు ఉల్లాసంగా గడిపారు.