సీతారాముల కల్యాణాన్ని కనులారా చూడాలని భక్తులు కోరుకుంటారు. ఈసారి కరోనా కారణంగా కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం నగర వాసులకు లేకుండాపోయింది. సీతారాముల కల్యాణోత్సవం రోజున భక్తులతో నిండి ఉండే ఆలయాలు... ఇవాళ కేవలం పురోహితులు, ధర్మకర్తలు, కొంతమంది ఆలయ సిబ్బంది మాత్రమే కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని టీవీల్లోనే చూడాలన్న ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించినట్లు పలు దేవాలయాల అర్చకులు తెలిపారు.
జంటనగరాల్లో నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు - Corona Effect Sri Rama navami
కరోనా మహమ్మారి నేపథ్యంలో జంట నగరాల్లో... పలు దేవాలయాల్లో హంగు ఆర్భాటం లేకుండా శ్రీసీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. లాక్‌డౌన్ ఆంక్షల దృష్ట్యా సామాజిక దూరం పాటించే లక్ష్యంతో పరిమిత సంఖ్యలో సైతం భక్తులను అనుమతించ లేదు. ఇళ్లల్లోనే ప్రజలు శ్రీరామ నవమి వేడుకలను జరుపుకున్నారు.
Sri rama navami
హైదరాబాద్‌లో శ్రీరామ భక్తుడు డా. చెక్కిళ్ల రాజేంద్రకుమార్ తన నివాసంలో... శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని శోభాయమానంగా జరిపించారు. కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణం భారతీయ సంస్కృతిలో గొప్ప ఆదర్శప్రాయమని... జీవితంలో భార్యా భర్తలు ఏ విధంగా ఉండాలన్నది నేర్పిస్తుందని రాజేంద్రకుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:ఆ సొరంగంలో నడిస్తే కరోనా వైరస్ హతం