శ్రీరామ నవమిని పురస్కరించుకుని భాగ్యనగరంలోని కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా... కల్యాణానికి భక్తులను అనుమతించ లేదు. ఆలయ ఈఓ అన్నపూర్ణ, వేద పండితులు, ఇతర సిబ్బంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే కల్యాణోత్సవాలను జరిపించారు. భక్తులు లేకుండా కల్యాణాన్ని జరిపించడం బాధాకరమని ఈవో అన్నపూర్ణ అన్నారు.
కర్మన్‌ఘాట్‌లో సీతారామ కల్యాణోత్సవం - కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం
హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఎవరూ లేకుండా కేవలం ఆలయ ఈవో అన్నపూర్ణ, వేద పండితుల నడుమ సీతారాముల కల్యాణం జరిగింది.
Sri Rama Navami