హైదరాబాద్ మియాపూర్లో శ్రీ రామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మేళ తాళాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతా రాముల కల్యాణమహోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉత్సవ మూర్తులను పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణ రామయ్యను దర్శించుకున్నారు. ప్రతిఏటా నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
మియాపూర్లో ఘనంగా రామయ్య కల్యాణం - మియాపూర్లో రామయ్య కల్యాణం
హైదరాబాద్ మియాపూర్లోని రామాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణ రామయ్యను దర్శించుకున్నారు.
రామయ్య కల్యాణం