తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో శ్రీరామనవమి శోభాయాత్ర జరిగే మార్గాలివే... - Hyderabad latest news

Sri Ram Navami Shobhayatra in Hyderabad: హైదరాబాద్​లో శ్రీరామనవమి శోభాయాత్రకు భాగ్యనగర్​ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ శోభాయాత్ర మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్‌ ఆలయం నుంచి ప్రారంభమై.. హనుమాన్‌ వ్యాయామశాల వరకు సాగనున్నట్లు ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు.

RAM
RAM

By

Published : Mar 29, 2023, 5:08 PM IST

Sri Ram Navami Shobhayatra in Hyderabad: హైదరాబాద్​లో శ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భాగ్యనగర్​ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవత్​రావు తెలిపారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో.. 2010 నుంచి హైదరాబాద్​లో శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 200 సంవత్సరాల చరిత్ర గల సీతారాంబాగ్​లోని రామాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతుందన్నారు.

ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్ - మంగళహాట్ పీఎస్ - పురానా పూల్ - బేగంబజార్​ - సిద్ధంబర్ ​బజార్ - గౌలిగూడ - గురుద్వారా - రాంమందిర్ ​- తిలక్​ పార్క్ - పుత్లిబౌలి - కోఠి ఆంధ్రాబ్యాంక్ - బడి చౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుతుందన్నారు. అంబర్​పేట్​ నుంచి, ఫిలింనగర్ నుంచి మరి కొన్ని శోభాయాత్రలు కోఠి వ్యాయామశాలకు వస్తాయన్నారు.

ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర దూల్​పేట్​ కూడలి వద్ద కలుస్తుందని తెలిపారు. శాంతియుతంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తామని.. శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవున అన్న పానీయాలు అందుబాటులో ఉంటాయని భగవత్​రావు స్పష్టం చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తరలిరావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. యాత్రలో భాగంగా శ్రీరాముని వేషధారణతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో పలువురు కనిపించనున్నారు.

ముఖ్య అతిథిగా సుమేరు పీఠాధిపతి..

శ్రీరామనవమి రోజు సీతారాంబాగ్ రామాలయంలో ఉదయం 9 గంటల నుంచి శ్రీరాముని కళ్యాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.సీతారాముల కళ్యాణం అనంతరం మధ్యాహ్నం 1గంటలకు సీతారాంబాద్​ ఆలయం నుంచి శ్రీరామ శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ సంవత్సరం శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్ర నంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీసంత్ భోమా రాంజీ హాజరవుతారని తెలిపారు.

"శ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాము. సీతారాంబాగ్ రామాలయంలో ఉదయం 9 గంటల నుంచి శ్రీరాముని కళ్యాణం ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగుతుంది. ఈ సంవత్సరం శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్ర నంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీసంత్ భోమా రాంజీ హాజరవుతారు".- భగవత్ రావు, అధ్యక్షుడు భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details