తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తితో ఉన్నారని... శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ వెంకటేశ్వరన్ (Sri Lanka Deputy High Commissioner Venkateshwaran) తెలిపారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR)ని కలిసిన వెంకటేశ్వరన్ తెలంగాణలో ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని కితాబిచ్చారు.
Sdh Venkateshwaran: 'తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తల ఆసక్తి' - Sdh Venkateshwaran met ktr
హైదరాబాద్ ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR)ను శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ వెంకటేశ్వరన్ (Sri Lanka Deputy High Commissioner Venkateshwaran) కలిశారు. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని కితాబిచ్చారు.
తెలంగాణ పురోగమన పంథాలో ఉందని.. సాంకేతికతతో ముందడుగు వేస్తోందని... ప్రధానంగా ఔషధ, ఐటీ, చేనేత, జౌళి, వైమానిక రంగాల్లో విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోందని తెలిపారు. శ్రీలంకకు చెందిన పారిశ్రామికవేత్తలతో త్వరలో హైదరాబాద్‌లో సమావేశానికి యోచిస్తున్నామని వెంకటేశ్వరన్ చెప్పారు.
విదేశీ పెట్టుబడులకు అత్యంత విశ్వసనీయ గమ్యంగా తెలంగాణ రూపుదిద్దుకొందని.. శ్రీలంక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని... అన్ని విధాలా సహకరిస్తామని... కేటీఆర్ తెలిపారు. శ్రీలంక పారిశ్రామికవేత్తల బృందాన్ని.. రాష్ట్రానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరన్‌ను కేటీఆర్ సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.