శ్రీగంధం సాగు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు సీఎస్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
శ్రీగంధం రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: సీఎస్ - సోమేశ్ కుమార్‌ను కలిసిన శ్రీగంధం రైతులు
రాష్ట్రంలో శ్రీగంధం సాగుకు అవసరమైన సహకారం అందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులు హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
![శ్రీగంధం రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: సీఎస్ sri gandham farmers meet cs somesh kumar in secretariat in Hyderabad today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10830979-866-10830979-1614617868269.jpg)
శ్రీగంధం రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: సీఎస్
శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని.. కలప ఉత్పత్తుల అమ్మకాలకు లైసెన్సులు, డీలర్షిప్ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చందనం స్మగ్లర్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. రైతులు శ్రీగంధం సాగు చేయడాన్ని సీఎస్ అభినందించారు. 15 ఏళ్ల వ్యవధిలో రూ.36 లక్షల లాభాన్ని పొందినట్లు రైతులు సోమేశ్ కుమార్‌కు వివరించారు.